అనంతగిరిలో ఆర్టీసీ బస్సు బోల్తా

0
13 Views

వికారాబాద్: అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టిసి బస్సు బోల్తా పడిన సంఘటన ఓ మహిళ మృతి చెందగా బస్సులో ఉన్న 70 మందికి తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఎందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. వికారాబాద్ నుంచి ధారూర్ జాతరకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వికారాబాద్  నుంచి  70 మందితో బయలుదేరింది. అనంతగిరి నుంచి  దిగుతుండగా ఆర్టీసీ బస్సులు బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ కావడంతో గుట్ట చివరి భాగాన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్వరూప(33) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ బ్రేకు ఫెయిల్ అయ్యాయా అని తెలుపడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు రోదలను మిన్నంటగా బస్సులో నుంచి  కొందరు కిందకు దూకి  గాయాలపాలయ్యారు..కాగా మరికొందరు బస్సుల్లోనే ఇరుక్కుపోయారు. అదే సమయంలో అక్కడి నుండి దారి జాతరకు వెళుతున్న ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రమాదాన్ని గమనించి సహక చర్యలో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని, మృతురాలిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు వారు సూచించారు. అనంతరం అక్కడి నుండి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎంపీ ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని ఎందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.