మునిసిపల్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యయత్నం

0
18 Views

తాండూర్: తాండూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆత్మహత్య ను నివారించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మున్సిపల్ పరిధిలోని ధన్ గర్
గల్లీకి చెందిన ఇంటి నెంబర్ 5 -3-6 చెందిన ఇల్లు లలితమ్మ పేరు మీద ఉంది లలితమ్మ అనారోగ్య కారణంగా కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది అయితే ఆమెకు 9 మంది సంతానం ఉన్నారు అందులో విద్యాసాగర్ ఒకరు అయితే లలితమ్మ తమకున్న ఆస్తిని బుచ్చమ్మ పేరు మీద మార్పిడి చేసి మోటివేషన్ చేశారు అయితే లలితమ్మ పేరు పై ఉన్న ఇల్లుని మోసపూరితంగా బుచ్చమ్మ పేరుపై మార్చారని దీనికి సంబంధించిన మున్సిపల్ లో మోటివేషన్ కాపీని ఇవ్వాలని లలితమ్మ సంతానమైన విద్యాసాగర్ గత జనవరిలో మున్సిపాలిటీలో కొటేషన్ ఇవ్వాలని ఫిర్యాదు చేశారు. మోటేషన్ కాపీ పై పలుమార్లు మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని అంతేకాక మేనేజర్ నరేందర్ రెడ్డి లక్ష రూపాయల ఇవ్వాలని పేర్కొనడంతో తాను అంతా ఇవ్వలేనని చెప్పినా కూడా అధికారులు మోటేషన్ కాపీ ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వాపోయాడు దీంతో విద్యాసాగర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు బాధితుల మధ్య జరిగిన తీరును పరిశీలించి, సద్దుమణిగించారు