గల్లీ లీడర్ల నుంచి పెద్ద మనుషుల వరకు బెదిరించే వాళ్లే : సోషల్ మీడియాలో తహసీల్దార్ ఆవేదన

0
16 Views

వికారాబాద్: వ్యవస్థ నాయకుల కనుసనల్లో నడుస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఓ అధికారి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో కొందరు అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలని పోస్టులు పెట్టగా దానికి వికారాబాద్ తాసిల్దార్ స్వయంగా దానికి సాక్ష్యం నేనేనని కానీ అక్రమ ఎర్రమట్టి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుందాం అటే గల్లీ లీడర్ల నుంచి పెద్దమనుషుల వరకు అందరూ బెదిరించేవారని పేర్కొనడం విశేషం. అంటే వికారాబాద్ జిల్లాలో పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. గల్లీ లీడర్లు నుండి పెద్దమనుషుల వరకు ఒకవైపు పెత్తనం చెలాయిస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయి అధికారులు వారి చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని స్పష్టం   అవుతుంది.ఏది‌  ఏమైన  ఇలాంటి  నిజాయితీ గల అధికారులకు సలామ్

చేయాల్సిందే.