రాజీనామా చేయమని ఫోన్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా: మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

0
10 Views

వికారాబాద్: డైలీ యువర్ చైర్పర్సన్ కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని కానీ కొందరు రాజీనామా చేయాలని ఫోన్ చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో డైలీ వర్చర్ కోసం కార్యక్రమాన్ని చైర్పర్సన్ మంజుల రమేష్ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలపై ఫోన్ చేసి వివరించగా మరికొందరు  వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని ఆమె తెలిపారు. రాజీనామా విషయంలో ఎవరు మాట్లాడిస్తున్నారు తనకు తెలుసని ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. మరోసారి ఇలా రాజీనామా విషయంలో ఫోన్ చేస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు.