టిఆర్ఎస్ రైతుల చావు కోరుకుంటుంది: టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

0
32 Views

వికారాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల చావు కోరుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఫామ్హౌస్ లో పండుకున్న కేసీఆర్ను నిద్ర లేపేందుకు మూడింతల నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు . ఇప్పటికే మండల స్థాయిలో నియోజకవర్గస్థాయిలో ధర్నా కార్యక్రమాలు ధరణి కోసం చేపట్టామని ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పోడు భూముల విషయంతో పాటు ధరణి సమస్యలు పరిష్కాలనిపించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమేష్ కుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఆయిన ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో నిరుపేదలైన 84 లక్షల మంది రైతులకు భూములు పంపిణీ చేసిందని ఇప్పుడు ధరణి పేరుతో ఆ భూములను ప్రభుత్వం లాక్కొని అమ్ముకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు దాన్ని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ యాస భాష గురించి ప్రభుత్వం చెబుతుందని మనకు ముఖ్యమైనది అగ్రికల్చర్ అని అగ్రికల్చర్ నాశనం చేసే కుట్ర టిఆర్ఎస్ చేస్తుందన్నారు. దేశంలో లిక్కర్ స్కాం రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు తప్ప ప్రజా సమస్యలపై మీడియా ఎక్కడ చూపించడం లేదన్నారు. తప్పు చేసిన వాళ్లను శిక్షించడం తప్పుకాదని కానీ ఆ ముసుగులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పాటించాలని చూడడం సరైన పద్ధతి కాదన్నారు.  అమ్ముడుపోయిన ఎమ్మెల్యే మరోసారి అమ్ముడు పోవడం ఏమిటని ఆయన తాండూర్ ఎమ్మెల్యేను ఉద్దేశించి పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ లిక్కర్ స్కాం లో ఉన్న వారిని గళ్ళ పట్టి తీసుకెళ్లి తివారి జైల్లో వేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో 80,000 మందికి రైతు బీమా వర్తించిందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినారని అంటే రాష్ట్రంలో 80,000 మంది రైతులు చనిపోయారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షకు పైగా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారిని పరామర్శించిన పాపాన రాష్ట్ర ముఖ్యమంత్రి పోలేదన్నారు. రైతు బీమా రైతు బంధు పేరుతో రైతులకు వచ్చే సబ్సిడీ పరికరాలు , పంట నష్టపరిహారం ఇవేవీ అందడం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రావలసిన ప్రాణహిత చేవెళ్లను పేరు మార్చి కాలేశ్వరం పేరుతో ఆయన ఫామ్ హౌసుకు నీటిని మలుపుకున్నాడని పాలమూరు నుంచి రావాల్సిన నీటిని రాకుండా చేస్తూ జూరాల నుంచి నీరు వృధాగా సముద్రంలో కలిసేలా చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేసీఆర్ అనే దరిద్రం పట్టుకుందని ఆయనను బొంద పెడితే గాని రాష్ట్రం బాగుపడదన్నారు. తెలంగాణలో జరుగుతున్న సిబిఐ ఈడి రైడింగ్లు గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు జరగడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలుస్తుందని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జెండాను ఎగురవిస్తానని ఆయన భీమా వ్యక్తం చేశారు.