జిల్లాలో క్రైమ్ తగ్గింది: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

0
21 Views

వికారాబాద్ :గతంతో పోలిస్తే వికారాబాద్ జిల్లాలో 2022లో క్రైమ్ తగ్గిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో 2281 సీసీ కెమేరాలు పెట్టడం జరిగిందని దీని ద్వారా నేరాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
జిల్లాలో మొత్తంగా 2021లో 4396 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 3523 కేసులు నమోయ్యాయని తెలిపారు.
జిల్లాలో 12% శాతం క్రైమ్ రేటు తగ్గిందని తెలిపారు.
జిల్లాలో టాస్క్ ఫోర్స్ యాక్టివ్ గా పని చేస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో 198 కేసులు టాస్క్ ఫోర్స్ నమోదు చేయడం జరిగిందన్నారు.
సీసీఎస్ పోలీసులు నిఘా పై దృష్టి సారిస్తున్నారన్నారు.
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 356 మంది పిల్లలను రక్షించడం జరిగిందన్నారు. జిల్లాలో భరోసా కేంద్రం నిర్వాహణ, కార్డెన్ సెర్చ్, నాకాబంది కొనసాగుతుందని జిల్లా లో 12 కార్డెన్ సెర్చ్ లు నిర్వహించడం ద్వారా 376 వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 100కు 25081 ఫోన్లు రావడం జరిగిందని ఇందులో 204 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో ప్రధాన చౌరస్తాలు పెరుగాల్సి ఉందని అప్పుడు సిగ్నల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.