పరిగి జైలు వద్ద ఉద్రిక్తత … పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న అయ్యప్ప స్వాములు

0
29 Views

పరిగి: అయ్యప్ప స్వామి పట్ల అసభ్య పదజాలంతో దూషించిన బైరి నరేష్ ను పోలీసులు వరంగల్లో అరెస్ట్ చేసి కొడంగల్ కు తీసుకురాగా పోలీస్ స్టేషన్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. అక్కడినుంచి ఆయనను పరిగి జైలుకు తరలిస్తున్న క్రమంలోనూ పరిగి జైలు వద్దకు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు వారి నుండి తనను తాను కాపాడేందుకు పోలీస్ వాహనం దిగి బైరి నరేష్ జైల్లోకి పరుగులు ఇచ్చారు. ఇదిలా ఉంటే బైరి నరేష్ పై ఆగ్రహంతో ఉన్న అయ్యప్ప స్వాములు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో లాంటి గులిపించారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు పాల్పడవద్దని స్పందించగా బేరి నరేష్ టిఆర్ఎస్ పార్టీ కి చెందిన వ్యక్తి అని కొందరు బిజెపి పార్టీ వ్యక్తి అని కొందరు సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటున్నారు.