ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం: ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
30 Views

వికారాబాద్: ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ మధ్య కాలంలో కొడంగల్ లో ఒక సమావేశంలో బైరి నరేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా చూడటం జరిగిందన్నారు. ఆ వీడియోలో ఆ వ్యక్తి వాడిన పదజాలం సరైనటువంటిది కాదని వాక్ స్వాతంత్రం ఉంది కదా అని, హక్కలను దుర్వినియోగం చేస్తూ… ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.