అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్. తప్పిన పెనూ ప్రమాదం

0
27 Views

వికారాబాద్ : బస్సు నిండ ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిల్ కాగా వేగంగా వెళ్లి రోడ్డు పక్కన పొదాల్లోకి దూసుకెళ్లి ప్రయాణికులకు గాయాలు అయినా సంఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు డిపోకు చెందిన టీఎస్ 34 టీఏ 6363 బస్సు హైదరాబాద్ నుంచి తాండూరు వెళుతుంది. వికారాబాద్ బస్టాండ్ నుంచి 12.30 గంటల ప్రాంతంలో బయలు దేరిన ఆర్టీసీ బస్సులో సుమారు 90కి పైగామంది జనం ఉండడంతో రద్దీ కారణంగా ఎన్టీఆర్ చౌరస్తాలో నిలుపకుండానే బస్సును డ్రైవర్ పోనిచ్చాడు. ఆ
యితే అనంతపద్మనాభ స్వామి దేవాలయం దాటిన తరువాత ఘాట్ రోడ్డులో ఒక్క సారిగా బస్సు బ్రేకులు పెయిల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఎండీ షపీ బస్సులో ఉన్న వారికి బ్రేకులు ఫెయిల్ అ
య్యాయని అందరూ గట్టిగా పట్టుకోవాలని చెప్పుతూనే బస్సును ముందుకు పోనిచ్చాడు. చివరి ఘాట్లో బస్సు అదుపు తప్పడంతో ఒక్క సారిగా బోల్తా పడకుండా చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ షిపీ పొదాల్లోకి. పొనిచ్చాడు. దీంతో అక్కడ పెద్ద గుంత ఉండడంతో అందులో పడి లేచిన బస్సుతో ప్రయాణికులు ఒక్క సారిగా కుదించినట్లు కావడంతో బస్సులు ప్రయాణిస్తున్న వారందరికి చిన్నపాటి నుంచి రక్తగాయాల వరకు అయ్యాయి. దీంతో పక్కన ప్రయాణిస్తున్న ప్రయాణికులు గుర్తించి 108కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న 108 వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా స్వల్ప గాయాలు అయిన వారు వేరే బస్సులో వారి గమ్య స్థానాలకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ధారూరు, వికారాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన విషయాలపై వివరాలు సేకరించి డ్రైవర్ షఫీని అదుపులోకి తీసుకున్నారు.

గతంలో ఇదే ప్రదేశంలో బస్సు ప్రమాదం
అయితే సంవత్సరం క్రితం ఇదే ప్రదేశంలో ఇదే విధంగా బస్సు ప్రమాదం జరిగి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందిన సంఘటన మరువక ముందే ఆదే ప్రదేశంలో అదే తీరు లో బస్సు ప్రమాదం జరిగింది అయితే ఈ సారి అదృష్టం కొద్దీ బస్సు బోల్తా పడక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో రోడ్డు బాగా లేక పోవడంతో పాటు రోడ్డుపైకి చెట్ల కొమ్మలు వచ్చి ముందు రోడ్డు కన్పించకుండా తయారైందనిదీని ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా బస్సులు కొంత వేగంగా వెళుతున్నాయని, అద్దె బస్సులు అయితే చెప్పాల్సిన అవసరం లేదని ఇష్టానుసారంగా నడుపుతున్నారని మండి పడ్డారు. శనివారం జరిగిన బస్సు సైలం అద్దె బస్సు కావడం కొసమెరువు, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ అతి వేగంగా వల్ల ప్రమాదం జరిగిందని పలువురు పేర్కొన్నారు..
బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
ఎండీ షఫీ డ్రైవర్
బ్రేకులు ఫెయిల్ కావడంతో అందరిని బస్సులో గట్టిగా పట్టుకోమని చెప్పాను. రద్దీ ఎక్కువగా ఉండడంతో బస్సు కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారింది. అయినా దేవుడు దయ వల్ల ఎవరికి ఏమి కాలేదు. బస్సులో సీట్లకు మించి ప్రయాణికులు నిండిపోయారు. ఫుట్పోత్ వరకు ప్రయాణికులు ఉండడంతో బస్సు ఖాళీగా లేదని వేరే బస్సులో రావాలని చెప్పిన ప్రయాణికులు వినిపించుకోలేదు.