ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల, బాలికలను భారంగా చూడొద్దు:జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి

0
12 Views

వికారాబాద్(బషీరాబాద్):బాలికలను భారంగా చూడొద్దని, ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని తల్లి దండ్రులు సంబరపడాలని జడ్పి సీబీఐర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బషీరాబాద్ బాలికల పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొందరు ఆడపిల్ల పుడితే భారంగా భవిస్తారని, మగ పిల్లల కోసం ఆరాట పడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కడుపులో ఉండగానే ఆడపిల్ల అనితెలిస్తే భ్రూణ హత్యలు జరిగేవని, ఇప్పుడు కొంతమేర తగ్గాయన్నారు. ఆడపిల్లపై సమాజంలో ఇప్పటికి ఉన్న చిన్నచూపు పూర్తిగా అంతం అయ్యేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆడపిల్లలను తల్లిదండ్రులు లింగబేధం లేకుండా ఉన్నత చదువులు చదివించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం భేటి బచావో.. భేటి పడావో కార్యక్రమం ద్వారా కొంత మంచి జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆడపిల్ల పిడితే కేసీఆర్ కిట్ ద్వారా రూ.13 వేలు ఆర్థిక సాయం చేసిందని, వారి ఉన్నత చదువులకు కూడా ఆర్థిక సాయం చేయడంతో పాటు కల్యాణ లక్ష్మీ కిందా పెళ్లికి లక్ష రూపాయల సాయం చేసిందని గుర్తు చేశారు.
“‘పది’లో సత్తా చటాలి”
రాబోయే పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటాలని సునీతారెడ్డి విద్యార్థులకు సూచించారు. మంచి గ్రేడ్ లతో పసవుతామని విద్యార్థినులతో ప్రమాణం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హీర్యా నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.