ప్రత్యేక అధికారులుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
14 Views

వికారాబాద్:గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంపీడీవోలు, ఎంపీఓల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా కొత్తగా స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపికైన అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి వారికి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్లుగా నియామక ఉత్తర్వులు రేపటి వరకు అందించడం జరుగుతుందని, ఉత్తర్వులు అందిన వెంటనే గ్రామపంచాయతీకి సంబంధించిన రికార్డులు, లాగిన్లతో సహా పూర్తి చార్జిని తీసుకోవాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్లు గ్రామపంచాయతీలలో ఇంతకుముందు పాలకవర్గం నిర్వహించిన పనులన్నీ సక్రమంగా నిర్వహించాలన్నారు. తీసుకొనే ప్రతి నిర్ణయం ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ప్రభుత్వ ఆస్తులు నిధులు దుర్వినియోగం చేయకుండా పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో ప్రతిరోజు నిర్వహించే పారిశుద్ధ్య పనులు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర పనులను ఆటంకం లేకుండా చేపట్టాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు నిర్వహించాల్సిన పనులు 25 శాతం ఉంటే, క్రింది స్థాయి సిబ్బందితో 75 శాతం పనులు చేయించాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపిఓల సహకారంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని కొత్తగా ఎంపికైన స్పెషల్ ఆఫీసర్లకు కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ తో పాటు కొత్తగా ఎంపికైన స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.