ప్రభుత్వ వైద్య విద్యా కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ వివరాలను అందించాలి: జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
48 Views

వికారాబాద్: ప్రభుత్వ వైద్య విద్యా కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ వివరాలను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కొడంగల్ నియోజకవర్గం పరిధిలో వైద్య విద్య కళాశాల, నర్సింగ్, ఫార్మాసిటీ, ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటు నిమిత్తం ఉడిమేశ్వరం వద్ద నిర్మాణం చేపడుతున్న బీసీ గురుకుల పాఠశాల, అప్పాయి పల్లి, బొమ్మరాస్ పేట్, నాగిరెడ్డిపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని భూములను టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమల తామస్, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ శివరాం లతో కలిసి అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలించిన భూములకు సంబంధించిన వివరాలు, విస్తీర్ణం, చిత్రపటాలతో సహా వివరాలను అందించాలని ఆయన అధికారులకు సూచించారు. నివేదికలు సమర్పించినట్లయితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు.కొడంగల్ 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా విస్తరింపచేసెందుకు గాను ఆసుపత్రి ఆవరణలోని స్థలాన్ని కిమ్స్ డైరెక్టర్ విమల థామస్ సందర్శించి పరిశీలించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆసుపత్రిని పరిశీలించి ఇప్పటికే వినియోగించుకుంటున్న స్థలం వివరాలు, అదనంగా నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ఖాళీగా ఉన్న స్థల వివరాల మ్యాపులను ఆమె పరిశీలించారు.స్థలాల పరిశీలన లో కాడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, కొడంగల్ తహసిల్దార్ విజయ్ కుమార్, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రదీప్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్ర ప్రియ, డాక్టర్ సిహెచ్ వీణ, డాక్టర్ సాకేత్, బీసీ గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేట్ ఆఫీసర్ యాదయ్య గౌడ్, ప్రిన్సిపాల్ శంకర్ లు పాల్గొన్నారు.