2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రిమెట్రిక్‌ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానం: జిల్లా సంక్షేమ శాఖ అధికారిని లలిత కుమారి

0
38 Views

వికారాబాద్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ దివ్యాంగ విద్యార్థుల నుండి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రిమెట్రిక్‌ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని లలిత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంబంధిత పాఠశాలల ప్రిన్సిపల్స్‌, ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల వివరాలతో
https:telanganaepass.cgg.gov.in లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా సంక్షేమ అధికారిణి , మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ కార్యాలయంలో అందజేయాలని , పూర్తి వివరాలకు +919502912981 ఫోన్ నంబర్ సంప్రదించాలని సూచించారు.