ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

0
20 Views

వికారాబాద్:ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 127 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఇట్టి దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉంచరాదని అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్ల పనులను వెంటనే గ్రౌండ్ చేయాలన్నారు. నిధులు వృధా కాకుండా అవసరమైన మెటీరియల్ తెప్పించుకొని పనులను ప్రారంభించాలని సూచించారు. ఎక్కువ మంది ఉపాధి హామీ కూలీలను వినియోగించుకుని పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా నిర్వహించాలని అన్నారు. సరఫరాలో ఏమైనా సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని నిరాటకంగా నీటి సరఫరాను చేయాలన్నారు.ఆదివారం వికారాబాద్ లో నిర్వహించిన ఓపెన్ కరాటే, కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్ పోటీలలో కుల్కచర్ల మండలంలోని వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినిలు పోటీలలో పాల్గొని విజయం సాధించిన వారికి జిల్లా కలెక్టర్ సోమవారం వారికి ప్రశంసిస్తూ మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు.