ఆరోగ్యకరమైన జీవనానికి క్రీడలు దోహదం:చేవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
11 Views

వికారాబాద్ : ఆరోగ్యకరమైన జీవన విధానానికి క్రీడలు దోహదపడతాయని భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. వికారాబాదులో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది క్రీడల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. క్రీడలు క్రమశిక్షణను నేర్పుతాయన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతాయని చెప్పారు. సామాజిక నిర్మాణంలో భాగంగా గ్రామాలలో రోడ్లు, లైట్లు వలే ఒక ఆట స్థలం కూడా ఉండాలన్నారు. గోధుమ గడ్డ గ్రామంలో క్రీడలు బాగా ఆడతారన్నారు. ఈ క్రీడలను గ్రామస్తులు ఆసక్తిగా చూస్తారన్నారు. దీంతో ఈ గ్రామం మనదే అన్న భావన అందరిలోనూ కలుగుతుందని తెలిపారు.జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఏడాదికి మూడు నాలుగు సార్లు క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు ఐదు వందల టేబుల్ టెన్నిస్ టేబుల్స్ చాలా పాఠశాలలకు ఇచ్చానన్నారు. ఇరవై మూడు యూత్ క్లబ్‌లు ఏర్పాటు చేశానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అందుకే ఇటీవల జరిగిన ఆసియన్ గేమ్స్‌లో వంద పతకాలు వచ్చాయన్నారు. గతంలో కేవలం ఐదు నుంచి పది పతకాలు మాత్రమే వచ్చేవన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి : 9963980259 / 9959154371