ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
11 Views

వికారాబాద్:జిల్లా లో ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కటిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తెలిపారు.బుధవారం టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా , మున్సిపాలిటి  గ్రామ పంచాయతి పరిధి లో వాల్ రైటింగ్,పోస్టర్లు ,ప్లెక్ష్సి లు, ప్లాగ్ లు ఎక్కడ కూడా ఉండరాదని, ఫీల్డ్ సిబ్బంది చే తొలగించాలని అధికారులకు ఆదేశించారు.సి సి రోడ్ల నిర్మాణ పనులలో పురోగతి బాగుందని, అన్ని మండలా లలో సి సి రోడ్ల నిర్మాణ పనులు ఈ నెల 20 వరకు పూర్తి చేయాలనీ, పూర్తి అయిన వాటికీ ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అన్నారు. బొంరాస్ పేట్ , తాండూర్ , బషీరాబాద్ , కోడంగల్ మండలాల వారిగా ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తి అయ్యాయి, ఇంకా ఎన్ని పనులు చేయాల్సి ఉంది , ఇంకా చేయాల్సిన నిర్మాణ పనుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ప్రతి గ్రామ పంచాయతి బిల్డింగ్స్, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పూర్తి కాని పనులను సత్వరమే పూర్తి చేసి , పూర్తి అయిన వాటికీ తప్పని సరిగా ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ, ఉపాది హామీ కూలీల సంఖ్య పెంచాలని, అనుకున్న అంచనాల మేరకు పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్సు లో డి ఆర్ డి ఎ శ్రీనివాస్ , పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు డి ఇ లు , ఇ ఇ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.