రాజీమార్గమే రాజమార్గము:జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్

0
18 Views

వికారాబాద్ :లోక్ అదాలత్ లో రాజీపడితే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి
కె.సుదర్శన్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ లో బాగంగా వికారాబాద్ కోర్టులలో మొత్తం 623 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇరువర్గాలు విశాల దృక్పధంతో ఆలోచిస్తే లోక్ అదాలత్లతో కేసు నుంచి విముక్తి కలుగవచ్చన్నారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించు కోవచ్చన్నారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరు నిర్వర్తించినట్లయితే చాలా వరకు నేరాలు తగ్గుతాయన్నారు. ప్రతి వ్యక్తి చట్టాలపై తగిన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, సీనియర్ సివిల్ జడ్జి డీబీ శీతల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, అదనపు న్యాయమూర్తి శృతిదూత, ఏఎస్పీ రవీందర్రెడ్డి, పీపీ రాజేశ్వర్, అన్వేష్సింగ్, సమీనబేగం, బార్ అసోసియేషన్ అద్యక్షుడు జనార్ధన్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.