10 వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
17 Views

వికారాబాద్:జిల్లా లో జరిగే పదవ తరగతి పరీక్షలు నిర్భయంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయినందున జిల్లా కలెక్టర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రతి రూమ్ కు వెళ్లి పరిశీలిస్తూ పరీక్షలు రాసే విద్యార్థులు పక్క వారితో మాట్లాడరాదని, మాష్ కాపీ జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలని, అన్నారు. పాఠశాలలో 240 మంది విద్యార్థులకు గాను 239 మంది విద్యార్థులు హాజరయారని, ఒక్కరు గైర్హజరు అయ్యారని చీఫ్ సుపరింటేన్దేంట్ కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాత లోనికి పంపాలని, సెల్ ఫోన్ ను అనుమతించవద్దని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సునీత చీఫ్ సుపరిండెంట్, వినయకుమార్ అబ్జర్వర్ , సంబందిత అధికారులు తదితరులు ఉన్నారు.