లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టు లు ఏర్పాటు:జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

0
16 Views

వికారాబాద్:జిల్లాలో లోక్ సభ ఎన్నికల దృశ్య పాటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే జిల్లా కు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కల్గిన ప్రాంతాలలో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో చంద్రకల్, కస్తూర్ పల్లి, మైల్వార్, ఇందర్చేడ్, నవాంగి,కొత్లాపూర్ , బోపునరం ప్రాంతాలలో మొత్తం 7 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చెక్ పోస్ట్ లలో నిరంతరం వాహనాల తనిఖీలు సీసీటీవీ ల ఆధ్వర్యంలో లో చేయడం జరుగుతుంది. 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదు కలిగి ఉంటే దానికి సంబందించిన రషీదులు కల్గి ఉండాలని లేనిచో డబ్బులు సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది. గిఫ్ట్ వస్తువులు,పరికరాలు, బంగారం, వెండి మొదలగు వస్తువులు తరలించే సమయం లో ఖచ్చితంగా వాటికీ సంబందించిన రషీదులు తమ వెంట పెట్టుకోవాలని, లోక్ సభ ఎన్నికలలో ఎలాంటి అవంచానియమైన సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తనిఖీలు మొదలగు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనే విషయం పైన జిల్లా ప్రజలు దృష్టి సారించి పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ  తెలిపినారు.