ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి 100 శాతం పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
12 Views

వికారాబాద్:ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి 100 శాతం పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ ద్వార సంబంధిత అధికారులకు సి సి రోడ్ల కు సంబంధించి, లేబర్ మొబిలైజేషన్ కు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామ పరిదిలో ఎన్ ఆర్ ఇ జి ఎస్ వ్యవస్త ను బలోపేతం చేస్తూ కూలీల సంఖ్య ను పెంచుతూ పనులు 100 శాతం పనులు పూర్తి చేయిoచాలని, . గ్రామా లలో జాబ్ కార్డు ఉన్న వారందరికీ పని కల్పిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అనుకున్న అంచనా ప్రకారం కూలీల సంఖ్య ను పెంచుకోవాలన్నారు. గ్రామా పరిదిలో ఉండే చిన్న చిన్న సమస్యలను మండల అధికారుల దృష్టి కి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తి అయిన వాటికీ ఎఫ్ టి ఓ తప్పని సరిగా జనరేట్ చేయాలనీ, ఏ మండలం లో ఏ తేది వరకు ఎఫ్ టి ఓ జనరేట్ అయినది , ఇంకా చేయాల్సినవి ఎన్ని ఉన్నవి చెక్ చేసుకొని ఆ మండలాల టి ఏ లందరూ ప్రణాళిక ప్రకారం ఎఫ్ టి ఓ జనరేట్ అయ్యేవిదంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.టెలి కాన్ఫరెన్సు లో డి ఆర్ డి ఎ శ్రీనివాసులు,జిల్లా పంచాయతీ అధికారి సుధారాణి , సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.