పార్లమెంట్ ఎన్నికలకు సంబందించిన అంశాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి:జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
14 Views

వికారాబాద్: పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యత తో పని చేయాలనీ, వారికీ సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ (ఎ ఆర్ ఓ ) రాహుల్ శర్మ నోడల్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారము అదనపు కలెక్టర్ చాంబర్ నందు వికారాబాద్ నియోజకవర్గం 055 కు సంబంధించి ఎన్నికల నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా వంద శాతం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మెటీరియల్ దిస్త్రిబ్యుషణ్, మ్యాన్ పవర్, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని , ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్ఎస్టి ,ఎఫ్ ఎస్ టి బృందాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధుల నిర్వహణ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల సిసి కెమెరా ల ఏర్పాటు వందశాతం చేయాలని, అధికారులు తమ పరిధిలోని ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, మౌళిక సదుపాయాల పరంగా, భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి కార్యాచరణ చేయాలన్నారు. సువిధ యాప్ ద్వారా అనుమతులు జారిచేయాలని, రవాణా కార్యాచరణ పకడ్బందీగా చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఆయా సెగ్మెంట్ల పరిధిలోను, రిషిప్షన్ కేంద్రం ఒకేచోట కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పోలింగ్ స్టేషన్లు, రూట్ మ్యాపు చూసుకోవాలని, బి ఎల్ ఓ లు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటరు జాబితా సరి చూసుకోవాలన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాoగులకు హోం ఓటింగ్ నిమిత్తం ఫారం -12డి లను ఇంటింటికి అందజేయాలన్నారు.పౌరులు ఎవరైనా ఎన్నికలపై తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 1950 హెల్ప్ లైన్ 24/7 అందు బాటులో ఉంటుందని అన్నారు. ఆక్రమంగా డబ్బు, మద్యం సరఫరా, ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం వంటి వాటిని పకడ్బందీగా నియంత్రించాలని ఆదేశించారు. సి. విజిల్ యాప్ – ద్వారా కానీ 1950 టోల్ ఫ్రీ లేదా కంట్రోల్ రూంకు _ ఫిర్యాదులు వస్తె 15 నిమిషాల్లోనే సంఘటన స్తలానికి చేరుకునే విధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ప్రతిరోజు నివేదికలు పంపే విధంగా ఎం సి సి నోడల్ అధికారి, అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన వివరాలు రిపోర్టులను ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి ,బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ అధికారి చూడాలని, రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించే విధులు సంబంధిత అధికారి చూడాలన్నారు. సమావేశం లో డి ఎస్ పి శ్రీనివాస్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ , తహసిల్దార్ లు సంబంధింత అధికారులు పాల్గొన్నారు.