నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి.. దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటేయండి..పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం.. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
24 Views

అనంతగిరిడెస్క్: దేశం కోసం ఆహర్నిషలు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి మద్దతుగా మనందరం కలిసికట్టుగా పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులోని వివిధ మార్వాడి సంఘాల సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశం కోసం, ధర్మం కోసం బీజేపీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.మోదీ ఎనిమిది సంవత్సరాల పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్టు వివరించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ముందుకు వచ్చే కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసగించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది తెలంగాణలో అభివృద్ధి జరిగే అవకాశం లేదన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకు వచ్చి చేవెళ్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అనేకనిధులు మంజూరు చేసిందని అన్నారు. 2014 ముందు దేశంలో అవినీతి మాత్రమే ఉండేదన్నారు. 9 ఏళ్ళ మోదీ పాలనలో ఒక్కరు కూడా అవినీతి గురించి మాట్లాడే దైర్యం లేదన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం రూపురేఖలు మారిపోయాయన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకును చీల్చడం ఎవరి తరం కాదని, పార్లమెంట్ ఎన్నికల్లో పక్కాగా బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బాలేశ్వర్ గుప్తా, భద్రేశ్వర్, శ్రీలత, ఉప్పరి రమేష్, మార్వాడి సంఘాల నాయకులు, బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.