లోక్ సభ ఎన్నికలకు సంబందించి మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి:ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
41 Views

వికారాబాద్: సాధారణ లోకసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వహించే పిఓ, ఎపిఓ, ఓపిఓ ల విదుల కేటాయింపునకు మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఐ డి ఓ సి ఎన్ ఐ సి వీడియో కాన్ఫరెన్సు హాలు నందు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గాలకు సిబ్బంది కేటాయింపునకు ఆన్లైన్ ద్వారా మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు . ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో నాలుగు నియోజకవర్గాలు కోడంగల్ , పరిగి, తాండూర్, వికారాబాద్ నియోజకవర్గాలకు పి ఓ , ఏ పి.ఓ , ఓ పి .ఓ పోలింగ్ సిబ్బందిని మొదటి దశ ర్యాండ మైజేషన్ ద్వారా విదులు కేటాయించినట్లు తెలిపారు. ప్రక్రియ పూర్తి చేసి స్క్రీన్ ద్వారా చూపించారు. మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ తదుపరి మాస్టర్ ట్రైనర్స్చే పిఓ, ఏపిఓ లకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ , ఎన్నికల సెక్షన్ సుఫరిండెంట్ శ్రినివాష్, ఈ.డి.ఎం మహమ్మద్ సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.