జిల్లాలో నాటు సారా తయారి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు

0
26 Views

తాండూరు : తాండూరు నియోజకవర్గంలోని నాటు సారా తయారి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఇటీవల జరిపిన దాడులతో పాటు తాజాగా జరిగిన దాడులలో మొత్తం 41 కేసుల్లో 19 మంది అరెస్టు, 18 మందికి బైండోవర్ చేసినట్లు శనివారం తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి డిప్యూటి కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్, జిల్లా ఎక్సైజ్ అధికారి, ఏఈఎస్ ఎన్ ఫోర్స్ మెంట్, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో శనివారం పెద్దేముల్ మండలం నీలిగడ్డ తండా, మదనంతాపూర్ తాండాలలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 2600 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం చేయడంతో పాటు 12 కేజీల నల్లబెల్లం స్వాదీనం చేసుకుని 10 కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు. అదేవిధంగా ఇటీవల తాండూరు నియోజకవర్గం తాండూరు మండలం, పెద్దేముల్ మండలం, బషీరాబాద్ మండాలల కర్ణాటక సరిహద్దు తాండాలతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఓమ్లానాయక్ తాండా, రాంసింగ్ తాండా, పాష పూర్ తాండా, బాయిమీది తాండా తదితర తాండాలలో దాడులు నిర్వహించి దాదాపు 600లీటర్ల బెల్లం పాకం, 4 లీటర్ల నాటు సారా స్వాదీనం చేసుకోవడంతో పాటు నాలుగు కేసులలో సుభాష్, రాథోడ్ గోపాల్ లను అరెస్టు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పలువురు నాటు సారా తయారిదారులను బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా గుడుండా తయారి దారులకు నల్ల బెల్లం సరఫరా చేస్తున్న తాండూరు పట్టణానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తిపై కేసు సమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు.