మోమిన్ పేట్ అర్బన్ రెసిడెన్షియల్లో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితుల పైన డీఈవో సమాధానం చెప్పాలి: POW జిల్లా కార్యదర్శి వై గీత

0
13 Views

వికారాబాద్ (మోమిన్ పేట ): మోమిన్ పేట్ అర్బన్ రెసిడెన్షియల్లో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితుల పైన డీఈవో సమాధానం చెప్పాలలని ప్రజాసంఘాలు నాయకులు POW జిల్లా కార్యదర్శి వై గీత, CRPF జిల్లా అధ్యక్షులు శివరాజ్ లు డిమాండ్ చేశారు.  మోమిన్ పేట మండల కేంద్రంలోని హర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.  జిల్లా కలెక్టర్ , ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టువంటి హర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు.  గత సంవత్సరం మరియు ఈ విద్య సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మెనూ కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేదని, అధికారులు ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన విద్యార్థులకు  అందడం లేదన్నారు.  ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి 30 మంది విద్యార్థులకు 17 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారని కనీసం క్లాసులో బ్లాక్ బోర్డ్ కు నోచుకోని స్థితిలో ఉందన్నారు. స్నానం గదులు మరుగుదొడ్లు 1 కూడా లేదు బయట స్నానాలు పొలాల్లోకి విసర్జనకు పోతున్నారన్నారు. పరిస్థితి క్లాస్ లో బోధన లేకుండా పిల్లలతోటి పుస్తకం ఇచ్చి చదువుకోమని చెప్పడమే ఇక్కడ బోధన ఇంటి వద్ద కటిక పేదరిక పరిస్థితులు సహకరించక హాస్టల్లో తల్లిదండ్రుల విద్యార్థులను చేర్పిస్తే ఇక్కడ విద్యార్థులు శిక్షిస్తున్న బాల నేరస్తుల్లాగా జీవనం కొనసాగిస్తున్నారన్నారు.   జిల్లా విద్యాధికారి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల నుండి వచ్చే ముడుపులు తీసుకొని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పరిమితమై పనిచేయడం తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడంలో కీలకంగా డీఈఓ నిర్లక్ష్యం ఉందని డీఈఓ  మోమిన్ పేట అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఒకరోజు బస చేయాలని అప్పుడు హాస్టల్ పరిస్థితి డీఈవో కి అర్థమవుతుందన్నారు.  వారి వెంటా  సిఆర్పిఎఫ్ డిస్టిక్ మెంబర్ మాణిక్యం, నాయకులు శివకుమార్ mvf మండల కోఆర్డినేటర్ యాదయ్య  ఉన్నారు.