ఆరు హామీలు అమలు చేసే దిశగా ముమ్మర చర్యలు : వైద్య మంత్రి దామోదర్ రాజనర్సింహ

0
11 Views

 

అనంతగిరి డెస్క్: దేశ చరిత్రలో రైతులకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జహీరాబాద్ నియోజకవర్గ ఆశాదీపమైన చక్కెర పరిశ్రమలో గతంలో రైతులు వేసిన చెరుకు పంట బిల్లులు ఇవ్వడంలో గత యాజమాన్యం విఫలమైనప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే ట్రెడెంట్ చక్కెర పరిశ్రమ నూతన యాజమాన్యంతో చర్చలు జరిపి గత ప్రభుత్వం బకాయిలు ఇప్పించడంలో 7.5 కోట్ల రూపాయల మిగిలిపోవడంతో రైతులకు ఇప్పించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం నాడు నియోజకవర్గ పరిధి పట్టణ కేంద్రంలోని ఫ్రెండ్స్ కల్యాణ మండపంలో మాజీ మంత్రి జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఆగం చంద్రశేఖర్ అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వైద్య మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎల్లరెడ్డి శాసనసభ సభ్యులు మదన్ మోహన్ రావు, నియోజకవర్గ ఇంచార్జ్ డా. ఆగమ చంద్రశేఖర్, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపిపి గిరిధర్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆగమ సాయి చరణ్, పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, కోహిర్ మండల జడ్పిటిసి గురుగబాయి రాందాస్, జహీరాబాద్ మండల జడ్పిటిసి నాగిశెట్టి, ఝారసంగం ఎంపిపి దేవదాస్, కోహిర్ ఎంపిపి శ్రీమతి మాధవి, మొగుడం పల్లి ఎంపిపి ప్రియాంక గుండారెడ్డి, టిపిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బ్యాగారి రచయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు కండేం నర్సింలు, మండలాల అధ్యక్షులు పి నర్సింహారెడ్డి, రామలింగ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మొహమ్మద్ మాక్సుద్ అలీ, హన్మంత్ రావు, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆర్షద్ అలీ, కోహిర్ పట్టణ అధ్యక్షుడు శంషీర్ అలీ, బిలాల్ పూర్ సహకార బ్యాంక్ చైర్మైన్ సయ్యద్ రియాజ్, సత్వర్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు బాబా పటేల్ ఇప్పేపల్లి, న్యాయవాది గోపాల్, న్యాల్కల్ మండల వైస్ ఎంపిపి మొహమ్మద్ గౌసోద్దీన్, సీనియర్ నాయకులు మొహమ్మద్ రఫియోద్దీన్ న్యాల్కల్, మాజీ వైస్ ఖాజా మియా, మనియర్ పల్లి రాజ్ కుమార్, బౌగి మల్లికార్జున్, జగదీష్ రెడ్డి, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.