గుడి కూల్చి బిల్డింగ్ కట్టింది ఎవరూ కోర్టు చెబుతుంది: బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి

0
13 Views

తాండూర్ (యాలాల): దేవుని గుడి కూల్చి అపార్ట్మెంట్లు కట్టిందెవరో అందరికీ తెలుసని ఈ విషయం పై కేసు కూడా నడుస్తుందని రెండు మూడు రోజుల్లో కోర్టులో తీర్పు వెలబడుతుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పై బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని రాస్నం, కోకట్, లక్ష్మీనారాయణపూర్, తదితర గ్రామాలతో పాటు బషీరాబాద్ మండలంలోని నవల్గా, బషీరాబాద్, జీవన్గీ తదితర గ్రామాలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మోడీని స్మరించుకుంటూ బిజెపి పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని గ్రామస్తులకు వివరించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఘనతను, పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రంజిత్ రెడ్డి కరోనా కష్టకాలంలో గుడ్లు అమ్ముతూ బతికాడని అన్నారు. అంతేకాక చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో సరైన గుర్తింపు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఓడిపోతానని తెలిసి అధికార పార్టీలో చేరారని విమర్శించారు. రంజిత్ రంజిత్ రెడ్డి కన్నా ప్రజలు తనను ఎంపీగా ప్రజలు ఇప్పటికీ గుర్తిస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన ఘనత తనదేనన్నారు గ్రామ సర్పంచులకు ఉత్తరాలు రాసి అభివృద్ధి సలహా, సూచనలు అందించి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్ళ గనుక తనకే దక్కుతుందన్నారు. రంజిత్ రెడ్డి హనుమాన్ దేవాలయాన్ని కూల్చి అపార్ట్మెంట్లను కట్టిన ఘనత ఆయనకు ఉందని ఎద్దేవా చేశారు. దీనిపై అప్పట్లోనే కేసు కూడా నమోదు చేశానని రెండు, మూడు రోజులలో కేసు హియరింగ్ వస్తుందని పేర్కొన్నారు. తనకు ప్రజాబలం లేదని గ్రహించిన రంజిత్ రెడ్డి గ్రామ గ్రామాన నిర్వహించే పాదయాత్రను కూడా రద్దు చేసుకున్నారని విమర్శించారు.