బుధవారం వికారాబాద్ కు కేటీఆర్ రాక

0
11 Views

వికారాబాద్ : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ నియోజకవర్గ సమావేశం ఈ నెల 3న వికారాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తెలిపారు. పట్టణంలోని గౌలికార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవిలు హాజరవుతున్నారన్నారు. ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు.