40 సంవత్సరాల పరిపాలనలో తాండూరు ప్రాంత రోడ్లు ఆధ్వాన్నంగానే ఉన్నాయి.: బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
22 Views

తాండూరు : 40 సంవత్సరాలపాటు గత ప్రభుత్వాలు పరిపాలించిన కానీ ఇప్పటివరకు తాండూర్ ప్రాంతంలో ఉన్న రోడ్ల వ్యవస్థ ఆధ్వాన్నంగా ఉందని బీజేపీ పార్టీ చేవెళ్ల అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం మీడియాతో కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ టిఆర్ఎస్ పరిపాలించిన ఈ ప్రాంతంలో ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. ఈ ప్రాంతం రాష్ట్ర సరిహద్దు లో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదని అన్నారు. సున్నపురాయి నిల్వలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ఈ ప్రాంతాలు ఏమాత్రం అభివృద్ధి జరిగే లేదని ఆరోపించారు. ఈ ప్రాంతం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు హైవే రావడంతో కొంతైనా రోడ్లు మెరుగుపడ్డాయని గ్రామాలలో ఇంకా రోడ్ల వ్యవస్థ మెరుగుపడాలని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని అన్నారు ఈ ప్రాంతంలో బిజెపిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని అన్నారు బిజెపి చేవెళ్ల ఎంపీగా జెండా ఎగరవేయడం ఖాయమని దిమా వ్యక్తం చేశారు.