సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం… పేలిన కాన్వాయ్ కారు టైరు

0
38 Views

వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రమాదం తప్పింది. సోమవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనకు వెళుతున్న రేవంత్ రెడ్డి  కాన్వాయ్ లో ఒక కారు టైరు పగిలిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో పంక్చర్ అయి ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ పగిలిపోయింది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఘటన జరుగగా కారు టైరు మార్చి కారు ముందుకు వెళ్లింది. విషయం తెలియగానే వికారాబాద్ జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి కాన్వాయ్ కి ఏమైందని ఆరా తీస్తుండగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు.