ఈనెల 25 నుండి ఓపెన్ పదవ తరగతి,ఇంటర్ పరీక్షలు

0
33 Views

వికారాబాద్: ఓపెన్ 10వ తరగతి , ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా నిర్వహించాలన్నారు. ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 25 నుండి మే 2వ తేదీ వరకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు అదేవిధంగా 2:30 నుండి 5:30 వరకు రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి వికారాబాద్ 2, తాండూర్ లో 2 పరీక్ష కేంద్రాల్లో 691 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అదేవిధంగా ఇంటర్ పరీక్షలకు వికారాబాద్ 3, తాండూరులో 2 పరీక్ష కేంద్రాల్లో 1095 మంది పరీక్షలకు హాజరు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద అత్యవసర మందులతో పాటు ఏఎన్ఎం, సిబ్బంది నియమించాలని వైద్యాధికారికి సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష సమయాలను బట్టి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను నడిపించాలని సంబంధిత అధికారులు ఆయన ఆదేశించారు. పరీక్షలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో డిఈఓ రేణుకాదేవి, డిఎంహెచ్ఓ పల్వన్ కుమార్ , ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె. రామ్ రెడ్డి, విద్యుత్ శాఖ డిఈ సత్యనారాయణ, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రమేష్, పోలీస్, ఆర్టీసీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.