జిల్లా అటవీ శాఖలో ప్రక్షాళన…వికారాబాద్ ఇన్ చార్జి ఎఫ్ఆర్వో గా శ్యామ్ కుమార్

0
162 Views

వికారాబాద్: అటవీ శాఖలో ప్రక్షాళన మొదలైంది.  ఆటవీ శాఖలో అవినీతికి పాల్పడిన అధికారులు స్థానంలో కొత్త అధికారులు చార్జీ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం తాండూరు ఎస్ఆర్వోగా అబ్దుల్ హైసాబ్ బాధ్యతలు తీసుకోగా తాజాగా బుధవారం వికారాబాద్, ధారూర్ ఎస్ఆర్వోగా శ్యామ్ కుమార్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. జూలై 2న వికారాబాద్ ఎస్ఆర్ వో అరుణ, తాండూరు ఎస్ఆర్ వో శ్యామ్ సుందర్ ను సస్పెండ్ చేయగా ఉన్నతాధికారులు ఆర్డర్లను రేంజర్లు లెక్క చేయకుండా వ్యవహరించారు. యధావిధిగా విధుల్లో ఉండడం అనంతరం పత్రికల్లో వార్తలు రావడంతో అప్రమత్తమైన అటవీ శాఖ ఉన్నతాధి కారులు తాండూరు ఎస్ఆర్ వోగా అబ్దుల్ హై సాబ్, వికారాబాద్,ధారూరు ఎస్ఆర్ఎ్వగా శ్యామ్ కుమార్ కు వెంటనే చార్జీలుతీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అధికారులు చార్జీలు తీసుకోవడం సస్పెన్షన్ అయిన అధికారులకు చెక్ పెట్టేశారు. అటవీ శాఖలో జరిగిన అవినీతి ఆపై ఇద్దరు అధికారుల సస్పెన్షన్ రాష్ట్ర స్థాయిలో చర్చతో వికారాబాద్
జిల్లా అటవీశాఖలో ప్రక్షాళన అవకాశాలు లేక పోలేదనే చర్చ మొదలైంది.