రాడార్ స్టేషన్ నిర్వహణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

0
344 Views

వికారాబాద్: రాడార్ స్టేషన్ నిర్వహణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని POW జిల్లా కన్వీనర్ వై గీత, AIKMS జిల్లా కార్యదర్శి మల్లేష్ లు కోరారు. గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.  వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవిలో 2900 ఎకరాల భూమిని రాడార్ స్టేషన్ VLF నిర్మాణానికి కేటాయించారని ఈ అడవిలో 12 లక్షల చెట్లను తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటాలని పిలుపునివ్వడం సంతోషకరం కానీ ప్రాజెక్టుల పేరుతో అనేక ఔషధ గుణాలు కలిగిన 12 లక్షల చెట్లను తొలగించడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమన్నారు.  అదేవిధంగా వీఎల్ఎఫ్ వల్ల 60 నుండి 70 కిలోమీటర్ల దూరంలో రేడియేషన్ ప్రభావం ఉండటం చేత వికారాబాద్ జిల్లా భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో నేవీ ఆర్డర్ స్టేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చినటువంటి అనుమతులను అన్నిటిని రద్దు చేసి దామగుండం అడవిని కాపాడగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో దామగుండం అడవి నివాసి సత్యానంద స్వామి, AIKMS నాయకులు రాములు, PDSU జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, POW నాయకులు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.