చెట్లను నాటినట్లయితే ప్రకృతిని కాపాడిన వారమవుతాం: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఇ. శ్రీధర్

0
375 Views

వికారాబాద్:చెట్లను నాటినట్లయితే ప్రకృతిని కాపాడిన వారమవుతామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఇ. శ్రీధర్ అన్నారు.శుక్రవారం స్వచ్చదనం-పచ్చదనం లో భాగంగా వికారాబాద్ మండలం ఘట్ కొండాపూర్, అనంతగిరి అటవీ పరిసరాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, వికారాబాద్ జిల్లా స్వచ్చదనం-పచ్చదనం ప్రత్యేక అధికారి ఇ.శ్రీదర్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద మొత్తంలో చెట్లు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉదృతంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైదుపల్లి పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో ముచ్చటిస్తూ… తమ భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకుంటారని అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా కమిషనర్ , కలెక్టర్ లు అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలోని హిల్ వ్యూ పాయింట్ నుండి అటవీ అందాలను తిలకించారు.వన మహోత్సవ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డివైఎస్ఓ హనుమంతరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ, జిల్లా సూపరింటెండెంట్ విజయ భాస్కర్, అబ్కారీ, అటవీ శాఖ అధికారులు, జైదుపల్లి పాఠశాల బాల, బాలికలు వున్నారు