మునిసిపల్ లో కలిసిన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలి: కలెక్టర్ ను కోరిన ఆరు గ్రామాల ప్రజలు

0
345 Views

వికారాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మున్సిపాలిటీలో కలిపిన ఆరు గ్రామాలను మున్సిపల్ నుంచి తొలగించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని మద్గురు చిట్టెంపల్లి కౌన్సిలర్ గోపాల్ అన్నారు . మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీలో విలీలమైన మద్గురుచిట్టంపల్లి, గుడిపల్లి బూర్గుపల్లి, ధన్నారం, గిరిగెట్ పల్లి, కొంపల్లి గ్రామాలను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎక్కువగా వ్యవసాయ రైతులుగా ఉన్న గ్రామాలను టెక్నికల్ గా ఆలోచించకుండా మున్సిపల్ లో కలిపారన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  రామచంద్రారెడ్డి మాట్లాడుతూ. మునిసిపల్ లో కొత్తగా కలిసిన గ్రామాలను గ్రామ పంచాయతీలుగాచేసేందుకు స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ సుముకంగా ఉన్నారని  తెలిపారు.  కలెక్టర్ నుకలిసిన వారిలో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.