సోనియాను బలిదేవత అన్న రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోస్తుండు: కేటీఆర్ విమర్శలు

0
80 Views

అనంతగిరి డెస్క్:తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు., మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తామని తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాని పేర్కొన్నారు. సోనియా గాంధీని గతంలో రేవంత్ రెడ్డి “దయ్యం, పిశాచి, బలిదేవత” అంటూ విమర్శించినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి “రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోస్తుండంటూ విమర్శించారు.ఃనీ ఆలోచనల్లో కుసంస్కారం, నీ మాటలు అష్ట వికారం,” అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి వేసిన చర్యలను గుర్తు చేస్తూ, “తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే,” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.