కవితను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్

0
287 Views

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో సంతోషకరమైన సందర్భం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన భర్త, కుమారునితో కలిసి ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న కవితకు కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమెకు దిష్టి తీసి పూజలు నిర్వహించారు.కవితను చూడగానే, తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం నుంచి బయటపడిన తన బిడ్డను చూసి, ఆయన కండ్లలో ఆనందభాష్పాలు కట్టలు తెంచుకున్నాయి. తన తండ్రి పాదాలకు నమస్కరించి, కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ సైతం తన బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని, ఆశీర్వదించారు.