ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. కూతురు రాకతో నూతనోత్సహం.. ప్రభుత్వ తీరుపై సభలు

0
130 Views

అనంతగిరి : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తిరిగి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన, తన ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిన రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాల్లో ప్రస్తుతం జరుగుతున్న మోసాన్ని ఎండగట్టేందుకు, విస్తృతంగా సభలు, కార్నర్ మీటింగ్‌లను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

రేపు కేసీఆర్, ఈ కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఆయన, ఈ సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, తమ దృష్టిలో జరుగుతున్న తప్పుడు ప్రకటనలను బహిరంగంగా ప్రశ్నించనున్నారు. రైతుల సమస్యలు, రుణమాఫీపై ప్రజల్లో జాగృతి తీసుకొచ్చేందుకు ఈ సభలు కీలకమని భావిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ ప్రచార వ్యూహం, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రేపటి షెడ్యూల్ ప్రకటనతో ఆయన తాను చేపట్టబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.