గుడివాడలో దారుణం

0
123 Views

అనంతగిరి డెస్క్:గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసి 300 పైగా వీడియోలను రికార్డ్ చేసినట్లు వార్తలు వెలుగు చూసాయి.ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు ‘వీ వాంట్ జస్టిస్’ అనే నినాదంతో నిరసనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి, విజయ్ కుమార్ అనే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ విషయం ఇప్పటికే ఒక వారం క్రితమే బయటపడినా, కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని విద్యార్థులు మండిపడుతున్నారు.అరాచకానికి పూర్తి న్యాయం జరిగే వరకు విద్యార్థులు పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేస్తున్నారు.