యూట్యూబ్ చానల్స్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన డిజిటల్ మీడియా యూనియన్

0
125 Views

హైదరాబాద్:యూట్యూబ్ చానల్స్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  గతంలో జాగృతి అనే చిన్న పత్రికలో పనిచేసి, సీఎం పదవిని పొందడానికి యూట్యూబ్ వంటి సామాజిక మీడియా వేదికలను వినియోగించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు యూట్యూబ్ చానల్స్‌ను చిన్న చూపు చూసినట్టు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. రేవంత్ రెడ్డి యూట్యూబ్ చానల్స్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయడమే కాకుండా, స్వేచ్ఛా మీడియా ప్రమాణాలను తగ్గించే ప్రయత్నమన్నారు. రేవంత్ రెడ్డి  గతంలో సామాజిక మీడియా ద్వారా ప్రజలకు చేరువై రాజకీయ విజయాలు సాధించారు. ఇప్పుడు అదే మీడియాను దూషించడం సరైనది కాదన్నారు.డిజిటల్ మీడియా ద్వారా లక్షలాది మంది ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న యూట్యూబ్ చానల్స్‌ను ఇలానే చిన్న చూపు చూడటం, వారి కృషిని అవమానించడం అన్యాయం అని ఆయన అన్నారు.