జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్

0
117 Views

వికారాబాద్:హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి లో ఎలాంటి పుస్తకాలు లభిస్తున్నాయో వికారాబాద్ జిల్లా లైబ్రరీలో కూడా అలాంటి పుస్తకాలు ఉంచడం జరుగుతుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ తెలిపారు వికారాబాద్ జిల్లా గ్రంధాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా గ్రంథాలయంలో వివిధ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా కచ్చితంగా ఉద్యోగాన్నియామకాలు చేపడతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరి సురేష్ బాబు గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.