కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం

0
681 Views

అనంతగిరి డెస్క్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జెండా ఎగురవేసే కార్యక్రమం జరిగింది. అయితే, జెండా ఎగరేసినప్పుడు అది తలకిందులుగా ఎగిరింది. ఈ విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దించి, సిబ్బందిని ఆదేశించి దాన్ని సరిచేయించారు. జెండాను సరిచేసిన తర్వాత మరల ఎగురవేశారు. ఈ ఘటనపై వివిధ రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.