వికారాబాద్ లో రోడ్డు ప్రమాదాలు 6 మందికి తీవ్ర గాయాలు

0
33 Views

వికారాబాద్:  వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో  6 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణంలోని ఆడియో కార్యాలయం ముందు కుల్కచర్ల గ్రామానికి చెందిన రామకృష్ణ ఒక బైక్ పై అదే విధంగా వికారాబాద్ లోని ఓ  కళాశాలకు చెందిన విద్యార్థులు చేతన్, వినయ్లు మరో బైక్ పై ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీ ప్రమాదంలో రామకృష్ణ తో పాటు చేతన్ కు తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా విశాఖపట్నం కు చెందిన యువకులు హైదరాబాద్ నుండి వికారాబాద్ లోని ఓ రిసార్ట్స్ కు వస్తుండగా వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధులూర్ వద్ద కారు టైరు పగలడంతో ముందు వస్తున్న బైక్ పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో రాఘవేందర్, ప్రత్యూష, ప్రియలత లు గాయ పడ్డారు. వీరిని వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.