వికారాబాద్ జిల్లాలో అంబులెన్స్ లో కవల శిశువులకు జన్మనిచ్చిన తల్లి

0
99 Views

వికారాబాద్ :  అంబులెన్స్‌లో ఓ గర్భిణీ ప్రసవం జరిగింది. ఇద్దరు కవల శిశువులకు జన్మనిచ్చింది. ఈ
కవలలలో ఒక మగ శిశువుకు సిపిఆర్ చేసిన శిశువును బ్రతికించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. వివరాలకు వెళ్తే వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాయిదిపూర్‌ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ 5వ కాన్పుకోసం తాండూరులోని జిల్లా మాతాశిశు ఆసుపత్రికి వచ్చింది. ప్రసవ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు రిఫర్ చేశారు. బషీరాబాద్‌కు చెందిన అంబులెన్స్‌లో తరిలిస్తుండగా ధారూర్ సమీపంలోకి రాగానే పురిటినొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ ఈఎంటీ శాంతు కుమార్‌ చంద్రకళకు కాన్సు చేశారు. ఈ కాన్పులో ఆమె ఒక మగ, ఒక ఆడ శిశువు ఇద్దరు కవలకు జన్మనిచ్చింది. అయితే మగ శిశువు ఊపిరి తీసుకోకపోవడంతో వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శాంతుకుమార్ సిపిఆర్ చేశారు. శిశు ఎద పై నొక్కి నోటి ద్వారా వాయును పంపించారు. దీంతో
బ్రతకడం జరిగింది ఆ తర్వాత
ఆమెను వికారాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నట్లు టెక్నీషియన్ శాంత కుమార్ అంబులెన్స్ డ్రైవర్ శివకుమార్ తెలిపారు. అందరూ అభినందించారు. మరోవైపు ఆసుపత్రిలో చేయని వైద్యం ఒక టెక్నీషియన్ చేయడంపై అందరూ ఆస్పత్రి వర్గాలపై విమర్శిస్తున్నారు.