కల్తీకల్లు తయారుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి : POW జిల్లా కన్వీనర్ వై గీత.

0
110 Views

వికారాబాద్:  వికారాబాద్ మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో కల్తీకల్లు విక్రయిస్తున్న యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని POW జిల్లా కన్వీనర్ గీత  అన్నారు. గురువారం కల్తీకల్లు తాగి వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించాారు. జరిగిన సంఘనకు పూర్తిగా ఎక్సైజ్ శాఖ అధికారులు బాధ్యత వహిస్తూ కల్తీకల్లు సేవించడం ద్వారా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలన్నారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులందరికీ వైద్య ఖర్చులు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని పేర్కొన్నారు.
గ్రామాలలో జోరుగా కొనసాగుతున్న కల్తీకల్లును నియంత్రించాలి ఎక్సైజ్ శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడాలని పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులు ప్రతి గ్రామంలో కల్తీ వ్యాపారాలపై దాడులు నిర్వహించి బాధ్యుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈ కార్యక్రమంలో రాజేష్ ,రాములు, శ్రీకాంత్, ప్రభావతి పాల్గొన్నారు