కల్తీ కల్లుకు కారణమైన వారిని శిక్షించాలి: చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

0
278 Views

వికారాబాద్: కల్తీ కల్లుకు కారకులైన వారు ఎంతటి వారైన సరే వారిని శిక్షించాలని, కల్లు సాపిల్స్ నాకు కూడా పంపాలని, అదే విధంగా ల్యాబ్ లలో పరిశీలిస్తే నిజ నిజాలు బయటకు వస్తాయని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్తీకల్లు బాధితులను ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ అవినాష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అది ఈత కల్లు కాదు  తాటికల్లుకాదని కేవలండైజోఫామ్ తో తయారు చేసిన కృతిమ కల్లు అని పేర్కొన్నారు. కల్తీకల్లును పూర్తిగా నిషేదించాలని తెలిపారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న కల్లు దుకాణాలను వెంటనే తొలగించాలన్నారు. చాలా మంది కల్తీ కల్లు భారిన పడ్డారని, ఇప్పటికే ఒకరూ మృతి చెందగా మరో ఒకరు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మధ్యం విక్రయాలు, కల్తీకల్లు అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులు మృతి చెందిన దుర్గయ్య గుండెపోటుతో మృతి చెందారని అధికారులు తెలుపుతున్నారాని ప్రశ్నించగా పోస్టుమార్టం రిపోర్ట్, కల్లు షాపిల్స్ పరిశీలించిన తరువాత నిజాలు తెలుస్తాయన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఆయన వెంటా నాయకులు నందు, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరోత్తం రెడ్డి, బస్వలింగం, తదితరులు ఉన్నారు.