కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బచావో బేటి పడావో ప్రోగ్రాం లో భాగంగా బాలికలందరికీ అవగాహన సదస్సు

0
21 Views

వికారాబాద్:మహిళ, శిశు, వికలాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుదవారం వికారాబాద్ పట్టణంలోని  కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బచావో బేటి పడావో ప్రోగ్రాం లో భాగంగా బాలికలందరికీ అవగాహన సదస్సు  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  బాగంగా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ ఎస్ బలరాం  మాట్లాడుతూ బాలహక్కులు , మహిళా హక్కులు వారి చట్టాల గురించి వివరించడం జరిగింది.  ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వారిని విద్య పరంగా అభివృద్ధి చేయాలని అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్నారు. వారికి ఎటువంటి సమస్యలు ఉన్న బాలల హెల్ప్ లైన్ నెంబర్ 1098 ,మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181, వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ 14567, దివ్యాంగుల హెల్ప్ లైన్ నెంబర్ 155326 నంబర్లను సంప్రదించగలరని కోరారు.  ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేజీబీవీ వైస్ ప్రిన్సిపాల్ సబిహ సుల్తానా మాట్లాడుతూ మేము ప్రభుత్వ పథకాలను , హెల్ప్ లైన్ నెంబర్లను వినియోగిస్తాము అలాగే మా పిల్లలందరూ ప్రభుత్వ అందించే పథకాలను వినియోగించుకునే విధంగా బాలికలకు బాలికలను ప్రోత్సహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ , శ్రీమతి వరలక్ష్మి  , బాబు , రాందాస్, కేజీబీవీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.