నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం: టెయిల్ పాండ్ నిర్వాసితులు ఆందోళన

0
104 Views

అనంతగిరి డెస్క్ : నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మంత్రి కాన్వాయ్ చిట్యాల గ్రామంలోకి రాగానే, టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్వాసితులు ఆయనను అడ్డుకున్నారు.

**నిర్వాసితుల ఆవేదన**

బాల్నేపల్లి, చిట్యాల గ్రామస్తులు తమ ఇళ్లకు జరిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా పరిహారం ఇవ్వాలని, తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు మంత్రి ముందు నిలిచారు. ఈ సందర్భంగా, ఇంట్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని మహిళలు ఆందోళన చెందారు.

**మంత్రికి పోలీసులు రక్షణ**

గ్రామస్తుల ఆందోళన మరింత ఉదృతంగా మారుతుండడంతో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కాన్వాయ్‌ వెంట ఉన్న పోలీస్ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఈ ఘటన తర్వాత గ్రామస్తులు మరింత ఆందోళన చెందుతూ, తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.