బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా వికారాబాద్ బంద్

0
271 Views

వికారాబాద్: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం హిందుఐక్య వేదిక పిలుపు మేరకు వికారాబాద్ బంద్ నిర్వహించారు. పట్టణంలోని అన్ని దుకాణాలు స్వచ్చంధంగా దుకాణాలు బంద్ చేయగా, హిందు బంధువులు పట్టణంలోని రామ మందిరంలో హనుమాన్ చాలిసా పటించిన అనంతరం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వెంటా శాంతి యుతంగా ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, మేధావులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు, పట్టణ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.