బీఆర్ఎస్ పెంపుడు కుక్క బాల్క సుమన్ :కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి

0
24 Views

వికారాబాద్:కేసీఆర్ కేటీఆర్ కవిత పెంచుకున్న పెంపుడు కుక్క మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అని సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడుతా అన్న చెయ్యిని నరికేస్తామని మునిసిపల్ ప్లోర్ లీడర్ , కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. పెంచుకున్న కుక్క వారి ఇంటి వద్ద మొరుగు కోవాలని ముఖ్యమంత్రిపై మొరిగేతే నాలుక కోస్తామని హెచ్చరించారు. చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరైంది కాదని 119 నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు తరిమికొడుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఈ విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడి చెప్పడం జరిగిందన్నారు. ఆ బిక్షతోనే బీఆర్ఎస్ నాయకులు పదవులు అనుభవించారని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ , నాయకులు కిషన్ నాయక్, రమేష్ , షరీప్, రాజు, మురళి , వేణు, లక్ష్మణ్ , చందర్ నాయక్ , మల్లేశ్, శ్రీనుముదిరాజ్, వెంకటయ్య గౌడ్ , రవీందర్ తదితరులు పాల్గొన్నారు.